బాలయ్య ‘మహానాయకుడు’ సినిమా వాయిదా పడనుందా..?

Ntr Mahanayakudu
- Advertisement -

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తున్న ‘యన్‌.టి.ఆర్‌.’  సినిమా.. రెండో భాగం విడుదల తేదీ వాయిదా పడనుందనే ఫుకారు టాలీవుడ్‌లో హల్ చల్ చేస్తోంది. నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సినిమా తొలి భాగం ‘యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు’ సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్‌ ప్రకటించింది. రెండో భాగం ‘యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు’ జనవరి 24న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేశారు.

కలెక్షన్లపై ప్రభావం పడుతుందని…

అయితే రెండు సినిమాల మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉండడంతో కలెక్షన్లపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారట నందమూరి ఫ్యాన్స్‌. అందుకే రెండో భాగాన్నివాయిదా వేయాల్సిందిగా చిత్ర యూనిట్‌పై ఒత్తిడి తెస్తున్నారట. మరి అభిమానుల కోరిక మేరకు యన్‌.టి.ఆర్‌ టీం సినిమాను వాయిదా వేస్తారేమో చూడాలి.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. మహానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా, ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్‌ నటిస్తోంది. ఇక అ‍క్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్‌, ఎన్టీఆర్‌ తనయుడు హరికృష్ణగా కళ్యాణ్ రామ్‌ నటిస్తున్నారు.

- Advertisement -