జగన్‌పై దాడి కేసు: కీలకంగా మారిన వైఎస్ జగన్ షర్ట్, దానికోసం న్యాయస్థానంలో పోలీసుల పిటిషన్…

jagan1
- Advertisement -

jagan1

విశాఖపట్నం: విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. నిందితుడు శ్రీనివాసరావు.. జగన్‌పై దాడి చేస్తున్నపుడు వైస్ జగన్ ధరించిన షర్ట్ ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకంగా మారనుంది.

చదవండి: షాకింగ్: వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం, కోడి పందేలకు వాడే కత్తితో దాడి…

వైఎస్ జగన్ ధరించిన షర్ట్‌ని తము స్వాధీనం చేసుకునే అవకాశం కల్పించాలని విశాఖ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసినట్లు విశాఖ పశ్చిమ ఏసీపీ ఎల్‌.అర్జున్‌ తెలియజేశారు. బుధవారం రాత్రి ఆయన ఎయిర్‌పోర్ట్‌ పోలీసుస్టేషన్లో విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. హత్యాయత్నం జరిగినప్పుడు ధరించిన షర్ట్ కి రక్తం అంటడంతో జగన్‌ దాన్ని మార్చుకుని, మరొకటి వేసుకుని విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లారని ఏసీపీ అర్జున్ తెలిపారు.

ఈ దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు మొబైల్ ఫోన్ కాల్‌ డేటాను తము విశ్లేషించామని, అతడు 321 మందితో ఎక్కువసార్లు మాట్లాడినట్లు గుర్తించామని ఆయన తెలిపారు. అలాగే మధ్యప్రదేశ్‌లో ఉంటున్న శ్రీనివాసరావు స్నేహితుడు కూడా విశాఖ వచ్చాడని, అతని నుంచీ సమాచారం రాబడుతున్నామని విశాఖ పశ్చిమ ఏసీపీ ఎల్‌.అర్జున్‌ పేర్కొన్నారు.

- Advertisement -