ప్రో కబడ్డీ లీగ్‌ 2018: దబాంగ్‌ ఢిల్లీపై.. గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ గెలుపు, మరో మ్యాచ్ ‘డ్రా’…

gujarat
- Advertisement -

gujaratనోయిడా: ప్రో కబడ్డీ లీగ్‌ 2018 సీజన్-6లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ 45–38 స్కోరుతో దబాంగ్‌ ఢిల్లీపై గెలుపొందింది. గుజరాత్‌ తరఫున డాంగ్‌ లీ 10 పాయింట్లు, రోహిత్‌ గులియా 7 రైడ్‌ పాయింట్లతో తమ సత్తా చాటుకున్నారు… ట్యాక్లింగ్‌లో పర్వేశ్‌ కూడా 6 పాయింట్లతో ఆకట్టుకున్నాడు.

ఇక ఆదివారం యూపీ యోధా, బెంగాల్‌ వారియర్స్‌ మధ్య జరిగిన మరో మ్యాచ్‌  30–30తో ‘డ్రా’గా ముగిసింది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌ కూడా హోరాహోరీగా సాగి చివరికి ‘డ్రా’గా ముగియడం గమనించదగ్గ విషయం.

ప్రొ కబడ్డీ లీగ్‌లో సోమవారం విశ్రాంతి దినం. అంటే సోమవారం ఏ మ్యాచ్ ఉండదు.

మంగళవారం జరిగే మ్యాచ్‌లు…

యూపీ యోధా x తెలుగు టైటాన్స్‌

జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ x హర్యానా స్టీలర్స్

- Advertisement -