ప్రొ కబడ్డీ లీగ్‌: హర్యానా స్టీలర్స్‌పై బెంగళూరు బుల్స్‌ విజయం..

haryana steelers
- Advertisement -

haryana steelers

పుణె: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 42–34తో హర్యానా స్టీలర్స్‌పై విజయాన్ని సాధించింది. పవన్‌ షెహ్రావత్‌ 20 పాయింట్లతో  చెలరేగి తమ జట్టుకు విజయన్ని అందించాడు. హర్యానా తరఫున వికాస్‌ కండోలా 14 పాయింట్లు సాధించాడు. చక్కని ఆట ప్రదర్శించినా హర్యానా  స్టీలర్స్ కు 15-13తో బ్రేక్‌కు వెళ్లింది. రెండో అర్థభాగంలో మాత్రం బెంగళూరు బుల్స్‌ అటాకింగ్‌ ఆటతో 10 నిమిషాలు ఆట ముగిసే సరికి 28-23తో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత వడివడిగా పాయింట్లు సాధించిన బెంగళూరు.. స్టీలర్స్‌కు మరో అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను విజయంతో ముగించింది. బుధవారం జరిగిన మరో మ్యాచ్‌లో యూపీ యోధ 29-23తో పుణె పల్టన్‌పై విజయం సాధించింది.

గురువారంనాడు ఏ పోటీలు జరగవు. నేడు సెలవు దినం

శుక్రవారం జరిగే మ్యాచ్‌ల వివరాలు

జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ x పాట్నా పైరేట్స్‌

గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ x తమిళ్‌ తలైవాస్‌

 

- Advertisement -