ఇండియా బౌలర్లకు చుక్కలు చూపించిన బ్లాక్ కాప్స్! ఇండియా ముంగిట భారీలక్ష్యం!

india vs newziland
- Advertisement -

india vs newziland

న్యూజిలాండ్ తో వెల్లింగ్టన్ లో జరుగుతున్న తొలి టీ20లో ఆతిథ్య జట్టు , భారత బౌలర్స్ కి చుక్కలు చూపించి , భారీ స్కోరును సాధించేది. నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. తద్వారా భారత్ ముందు 220 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.

భారత్ ముందు 220 పరుగుల భారీలక్ష్యం..

అంతకు ముందు టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కివీస్ ఓపెనర్లు సీఫ్రెట్, మన్రోలు భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. సీఫ్రెట్ 43 బంతుల్లో 84 పరుగులు (7 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసి విశ్వరూపం ప్రదర్శించాడు. మన్రో 20 బంతుల్లో 34 పరుగులు చేశాడు. వీదిద్దరూ 86 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మన్రోను ఔట్ చేసి కీలక భాగస్వామ్యానికి హార్దిక్ పాండ్యా తెరదించాడు. అనంతరం అహ్మద్ బౌలింగ్ లో సీఫ్రెట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఈ పరిస్థితుల్లో కూడా కివీస్ జోరు తగ్గలేదు. ఆ తర్వాత విలియం సన్ కూడా 22 బంతుల్లో 34 పరుగులు (3 సిక్సర్లు) చేసి స్కోరు బోర్దులు ఉరకలెత్తించాడు. మిగిలిన బ్యాట్స్ మెన్లలో మిచెల్ 8, టేలర్ 23, గ్రాండ్ హోమ్ 3 పరుగులు చేశారు. శాంట్నర్ 7 పరుగులు, కుగ్లీన్ 20 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా, భువనేశ్వర్, అహ్మద్ , కృణాల్ పాండ్యా, చాహల్ లు తలో వికెట్ తీశారు.

చదవండి : న్యూజిలాండ్ Vs భారత్: నేడు వెల్లింగ్టన్‌లో తొలి టీ20! తొలి విజయంపై టీమిండియా దృష్టి!

- Advertisement -