
హైదరాబాద్: ఉద్యోగం కోసమని సౌదీ వెళ్ళి ఏజెంట్లు చేతిలో మోసపోయి చివరికి గొర్రెల కాపరిగా చేస్తూ నరకం అనుభవిస్తున్న ఓ తెలంగాణ యువకుడు….తనని కాపాడాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని కోరాడు. ఈ మేరకు తన బాధని ఓ వీడియో ద్వారా కేటీఆర్‌కి చేరేలా చేశాడు.
అసలేం జరిగిందంటే.. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటకు చెందిన 21 ఏళ్ల మహ్మద్ సమీర్‌కి నిజామాబాద్ జిల్లాకి చెందిన ఓ ఏజెంట్… సౌదీలో ఓ ఫంక్షన్ హాల్లో పని ఇప్పిస్తానని చెప్పాడు.
చదవండి: ఉద్యోగం కోసం సౌదీ వెళ్ళి నరకం చూస్తున్న యువతి….
దీంతో సమీర్ ఏజంట్‌కి రూ. 80 వేలు చెల్లించాడు. ఇక తర్వాత ఏజెంట్‌ని నమ్మి సౌదీ వెళితే అక్కడ సమీర్‌ని గొర్రెల కాపరిగా నియమించారు. ఈ క్రమంలోనే యజమానులు సమీర్‌కి నరకం చూపించడం మొదలుపెట్టారు. ఆ బాధలు తట్టుకోలేక సమీర్…. ఓ వీడియో ద్వారా తన ఆవేదనని మొత్తం చెప్పాడు.
సౌదీలో ఉద్యోగం ఇప్పిస్తామంటే నమ్మి మోసపోయానని.. ఇక్కడ యజమానులు తనని చంపేసేలా ఉన్నారని, ఈ రంజాన్ మాసమే తనకి చివరిది అయ్యేలా ఉందని…. తనను ఎలాగైనా రక్షించండి అంటూ కేటీఆర్‌ని వేడుకున్నాడు. ఈ మేరకు కేటీఆర్‌కు ట్విట్టర్ లో వీడియోని షేర్ చేశాడు.
ఇక దీనిపై స్పందించిన కేటీఆర్… సమీర్‌ను స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
చదవండి: సౌదీలో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష! ఎంబసీకి కూడా సమాచారం ఇవ్వని అధికారులు!?
Request Ambassador @drausaf Saab and @IndianEmbRiyadh to help this gentleman Sameer to return to India https://t.co/TwzSlzjIMq
— KTR (@KTRTRS) May 14, 2019








