26.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ చంద్రగిరిలో తీవ్ర ఉద్రిక్తత! వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డిని అడ్డుకున్న కమ్మపల్లి గ్రామస్తులు…

చంద్రగిరిలో తీవ్ర ఉద్రిక్తత! వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డిని అడ్డుకున్న కమ్మపల్లి గ్రామస్తులు…

- Advertisement -

చిత్తూరు: ఈ నెల 19న చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించనున్నవిషయం తెలిసిందే. అయితే ఎన్నికలు ముగిసి ఇన్ని రోజులు అయ్యాక రీపోలింగ్ పెట్టడంపై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు సూచనలతో ఈసీ రీపోలింగ్ పెట్టడం ఏంటని సీఎం చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని ఎన్ఆర్ కమ్మపల్లిలో గురువారం రాత్రి తీవ్ర ఉద్రికత్త చోటుచేసుకుంది. గ్రామంలోని దళితులపై టీడీపీ నేతలు దాడులకు దిగుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

చదవండి:  ఆ రెండు ఎంపీ సీట్లలో క్రాస్ ఓటింగ్ టీడీపీకి ప్లస్….

ఈ క్రమంలోనే వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ గ్రామానికి వెళ్లారు. దీంతో తమ గ్రామంలోకి వచ్చిన చెవిరెడ్డిని గ్రామస్థులు లోపలికి రాకుండా అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ఘటనలు జరగకపోయినా రీపోలింగ్ ఎందుకు పెట్టించారని గ్రామస్తులు చెవిరెడ్డిని నిలదీశారు.

ఇక ఈ విషయం తెలిసిన టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కూడా కమ్మపల్లి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చెవిరెడ్డి,  పులివర్తి నానిలను అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి..ఇరు వర్గాలని అక్కడ నుంచి పంపించేశారు.

చదవండి: వైసీపీ అధికారంలోకి వస్తే.. కాబోయే మంత్రులు వీరేనా!?
- Advertisement -