22.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లాలో మళ్లీ అలజడి! ముగ్గురు టీడీపీ నేతలకి మావోయిస్టుల వార్నింగ్….

విశాఖ జిల్లాలో మళ్లీ అలజడి! ముగ్గురు టీడీపీ నేతలకి మావోయిస్టుల వార్నింగ్….

- Advertisement -

విశాఖపట్నం: విశాఖ మన్యంలోని మావోయిస్టులు మరోసారి టీడీపీ నేతలనీ లక్ష్యం చేసుకున్నట్లు కనిపిస్తోంది. విశాఖ జిల్లాకి చెందిన ముగ్గురు టీడీపీ నేతలనీ టార్గెట్‌గా చేసుకుని మావోలు ఘాటు లేఖ రాశారు.

టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, గిడ్డి ఈశ్వరి, కిడారి శ్రవణ్ లను హెచ్చరిస్తూ మావోలు లేఖ విడుదల చేశారు. సీపీఐ మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం పేరుతో ఈ లేఖ ఉంది.

చదవండి: ఆశ్చర్యం: ఒక్క పెయింటింగ్ ఖరీదు రూ.778 కోట్లు..! ఇంతకీ ఏముంది అందులో..?

ఆదివాసీల ఓట్లతో గెలిచిన మీరు ఆదివాసీలను ఏం పట్టించుకుంటున్నారు? అని మావోలు ప్రశ్నించారు. ఇక మే 1న వంచుల పంచాయతీలోని పనసలొద్ది, కొత్త వెదురుపల్లి గ్రామాలపై పోలీసులు దాడులు చేసి.. ఆరుగురు రైతులను అక్రమంగా నిర్బంధించారని, వారిని వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.

అయితే ఈ విషయంలో టీడీపీ నాయకులుగా మీ ప్రత్యక్ష భాగస్వామ్యం ఉందని భావిస్తున్నామని,  దీనిపై మీరు వెంటనే స్పందించి అరెస్టయిన ప్రజలను విడుదల చేయించకపోతే మన్యం ప్రజలే బుద్ధి చెబుతారు అంటూ వార్నింగ్ ఇచ్చారు.

కాగా, గతంలో మావోయిస్టులు దాదాపు ఇవే కారణాలతో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాను కాల్చి చంపిన విషయం తెలిసిందే.

చదవండి: కాంగ్రెస్‌కి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు! వైసీపీ నేత సంచలన ప్రకటన…
- Advertisement -