
హైదరాబాద్: మరో 6 రోజుల్లో వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కి సానుకూల పవనాలు వీస్తున్నాయని అన్నారు.
ఇక తెలంగాణలో 5 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ ఐదు సీట్లు… రేవంత్ రెడ్డి (మల్కాజ్‌గిరి), ఉత్తమ్ కుమార్ రెడ్డి (నల్గొండ), రేణుకా చౌదరి (ఖమ్మం), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (భువనగిరి), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల) గెలుపు ఖాయమని స్పష్టంచేశారు.
చదవండి: రాహుల్ ఓ ఫిరంగి.. మోడీ రాఫెల్ ఏజెంట్: సిద్ధూ
అలాగే వీరిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్, రేణుకా చౌదరికి కేంద్రమంత్రి పదవులు వస్తాయని చెప్పారు. అయితే లోక్‌సభ ఫలితాలు ఎలా ఉన్నా..తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డే ఉండాలన్నారు.
ఒకవేళ తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మద్దతుతో ప్రధాని అయ్యే పరిస్థితే వస్తే రాష్ట్రంలో అధికారం విషయాన్ని పట్టించుకోబోమని అన్నారు. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన 40 రోజుల తరువాత ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌లను ఎన్నుకోవడం దారుణమన్నారు.








