
ముంబై: చైనాకి చెందిన దిగ్గజ సంస్థ ఐఫాల్కన్ సరికొత్త ఫీచర్లతో ఓ స్మార్ట్ టీవీని విడుదల చేసింది. వీ2ఏ పేరిట 4కె ఆండ్రాయిడ్ టీవీని భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది.
ఇది 65 ఇంచుల డిస్‌ప్లే సైజ్‌ను కలిగి ఉంది. అలాగే ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారంగా ఈ టీవీ పనిచేస్తుంది. ఇక ఇందులో పలు ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.
చదవండి: అద్భుతమైన ఫీచర్లతో విడుదల కానున్న హువావే వై9 ప్రైమ్ 2019…
ఇందులో 2.5 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, గూగుల్ క్రోమ్‌క్యాస్ట్‌కు సపోర్ట్, 3 హెచ్‌డీఎంఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు, గూగుల్ అసిస్టెంట్‌కు సపోర్ట్, డాల్బీ డీటీఎస్ సౌండ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.
64 బిట్ క్వాడ్‌కోర్ సీపీయూ గల ఈ టీవీ ధర రూ.99,999 ఉండగా.. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తున్నారు. అలాగే ఐఫాల్కన్ సంస్థ టీవీ కొనుగోలు చేసే వినియోగదారులకి బంపర్ ఆఫర్ ఇచ్చింది.
ఈజీ ఈఎంఐల రూపంలోనూ ఈ టీవీని వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ డెబిల్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఈ టీవీని కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.








