బడ్జెట్ ధరలో హీరో మ్యాస్ట్రో ఎడ్జ్‌ 125 స్కూటర్..

9:58 am, Wed, 15 May 19

ముంబై: దిగ్గజ దేశీయ ద్విచక్రవాహనాల తయారీదారు హీరో మోటో కార్ప్స్….వినియోగదారులకి అందుబాటులో ఉండేలా…బడ్జెట్ ధరలో సరికొత్త మోడల్‌ మ్యాస్ట్రో ఎడ్జ్‌ 125ను మార్కెట్లోకి తాజాగా విడుదల చేసింది.

ఇక ఈ స్కూటర్…  ఫ్యూయల్ ఇంజక్షన్ (ఎఫ్ఐ), ఐ3ఎస్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎఫ్ఐ వేరియంట్ స్కూటర్ ధర రూ.62,700 కాగా, ఐ3ఎస్ వేరియంట్ డ్రమ్ బ్రేక్ ధర రూ.58,500గా ఉంది. అలాగే డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.60,000గా ఉంది.

అయితే ఇండియాలో ఎఫ్ఐ టెక్నాలజీతో మార్కెట్‌లోకి వచ్చిన తొలి స్కూటర్ ఇదే. ఇక మ్యాస్ట్రో ఎడ్జ్‌‌ బ్లూ, బ్రౌన్‌, గ్రే, రెడ్‌ రంగుల్లో, ఎఫ్‌ఐ వేరియంట్‌ పాంతర్‌ బ్లాక్‌, ఫేడ్‌లెస్‌ వైట్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.

చదవండి: అదిరిపోయే ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ షాపింగ్ డేస్ సేల్’

మ్యాస్ట్రో ఎడ్జ్ 125 ఫీచర్లు…

ఈ స్కూటర్‌ 125 సీసీ సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌, 8.5 బీహెచ్‌పీ శక్తి, 10.2 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. అలాగే 12 ఇంచుల ఫ్రంట్‌, 10 ఇంచుల రేర్‌ అలాయ్‌ వీల్స్‌, బ్లాక్‌ రేర్‌ వ్యూ మిర్రర్స్‌, ఎక్స్‌టర్నల్‌ ఫ్యూయల్‌ ఫిల్లర్‌ క్యాప్‌, యూఎస్‌బీ ఛార్జర్‌ వంటి ఫీచర్లతో ఈ మోడల్‌ని రూపొందించారు.

ఇందులో అదనంగా యూఎస్‌బీ చార్జర్, ఎల్‌ఈడీ బూట్ ల్యాంప్, రియర్ టెయిల్ ల్యాంప్, ఫ్రంట్ పాకెట్స్, డిజిటల్ ఎన్‌లాగ్ డ్యాష్ బోర్డు వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

చదవండి: వినియోగదారులకు శుభవార్త చెప్పిన జియో…