26.6 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ మరో బిజినెస్ ప్రారంభించనున్న రెబల్ స్టార్ ప్రభాస్!

మరో బిజినెస్ ప్రారంభించనున్న రెబల్ స్టార్ ప్రభాస్!

Prabhas Latest Updates, Tollywood Latest News, Telugu Movie news, Newsxpressonline
- Advertisement -
హైదరాబాద్: దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలని ఒక సామెత ఉంది కదా అది ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్ హీరోలకి సరిగ్గా సెట్ అవుతుంది. ఎందుకు అంటే ఒక పక్క టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూనే , మరో వైపు బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది స్టార్లు సినిమాలను ఓ వైపు, వ్యాపారాన్ని మరోవైపు నిర్వహిస్తూ, రాణిస్తుండగా, వారి దారిలోనే ప్రభాస్ నడవనున్నారని తెలుస్తోంది.సమాచారం.

రెబల్ స్టార్ తన చిన్ననాటి స్నేహితులు వంశీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ లు త్వరలో ఓ తెలుగు టీవీ చానెల్ ను ప్రారంభించాలని నిర్ణయించుకోగా, అందులో ప్రభాస్ కూడా భాగస్వామి కానున్నారని సమాచారం. దీనిపై అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. సూళ్లూరుపేట సమీపంలో ప్రభాస్ ఓ భారీ సినిమా థియేటర్ ను నిర్మిస్తున్నారు. ఇది ఇండియాలోనే అతిపెద్ద స్క్రీన్ తో ఉంటుందట. త్వరలోనే ఈ థియేటర్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

కాగా, గతంలో నాగార్జున, చిరంజీవి ఓ చానెల్ లో పార్టనర్స్ గా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఇక మహేశ్ బాబు ఏఎంబీ సినిమాస్ పేరిట చిత్ర ప్రదర్శన రంగంలోకి కూడా కాలుమోపారు. మహేశ్ దారిలోనే నడవాలని భావిస్తున్న బన్నీ, ఓ మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్నారన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్స్ సినిమాల్లో నటిస్తూనే, వ్యాపార రంగంలోనూ రాణించాలని తమవంతు ప్రయత్నాలు చేస్తుండటం విశేషం.

 
 
- Advertisement -