
ముంబై: డోమినార్ 400 బైకులు కొనుగోలు చేసే వినియోగదారులకి బజాజ్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇటీవలే మార్కెట్లోకి వచ్చి అమ్మకాల్లో దూసుకెళుతున్న డోమీనార్ 400 బైక్ ధరని తగ్గించింది. అసలు ధరపై బజాజ్ రూ. 3,723 తగ్గింపును ప్రకటించింది. ఈ మొత్తం తగ్గింపు తర్వాత రూ. 1,70,138(ఎక్స్ షోరూం ధర)కే డోమినార్ 400 లభించనుంది. అయితే ఈ బైక్ అసలు ధర రూ. 1,73,870గా ఉంది. తగ్గింపుకి సంబంధించిన విషయాన్ని బజాజ్ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది.
డోమీనార్ 400 ఫీచర్లు..
అప్డేటెడ్ వర్షన్‌తో వచ్చిన డోమినార్ 400 ఫీచర్లలో కొంత మార్పు చోటు చేసుకుంది. ముందు భాగంలో లెఫ్ట్‌సైడ్ డౌన్ సస్పెన్షన్ యూనిట్, స్లీకర్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉన్నాయి. కొత్త ఎగ్జాస్ట్ సిస్టమ్‌తో.. డ్యూయెల్ ఓవర్ హెడ్ క్యామ్‌షాఫ్ట్(డీఓహెచ్‌సీ) సెటప్ చేయబడి ఉంది.
అలాగే కంప్రెషర్ రేషియో 11.3 నుంచి 12.1కి పెంచడం జరిగింది. ఇక దీని 373.4సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 8,650 ఆర్పీఎం వద్ద 39.4బీహెచ్ఎం విడుదల చేస్తుంది. రీ-వర్క్‌డ్ ఎర్గోనామిక్స్‌తో ఈ బైక్ సుదూర సులభంగా ప్రాంతాలకు వెళ్లగలదు. కాగా, డోమినార్ 400 బైక్ నాలుగు రంగుల్లో వస్తోంది. మ్యాట్ బ్లాక్, సిల్వర్, గ్రాసీ రెడ్, ఆల్ న్యూ అరోరా గ్రీన్ రంగుల్లో ఉన్నాయి.
చదవండి:యూత్‌ని ఆకట్టుకునే హీరో మోటో కార్ప్ కొత్త బైక్స్…








