23.4 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ కేసీఆర్ గజకర్ణ, గోకర్ణ విద్యలు తమిళనాడులో పనిచేయలేదు: విజయశాంతి

కేసీఆర్ గజకర్ణ, గోకర్ణ విద్యలు తమిళనాడులో పనిచేయలేదు: విజయశాంతి

kcr-vijayashanti
- Advertisement -

హైదరాబాద్: ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం తమిళనాడు డీఎంకె అధ్యక్షుడు స్టాలిన్‌తో సమావేశమైన విషయం తెల్సిందే. ఆయన్ని ఫెడరల్ ఫ్రంట్‌లో భాగంగా కావాలని కేసీఆర్ కోరగా…దాన్ని స్టాలిన్ సున్నితంగా తిరస్కరించారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్-స్టాలిన్ భేటీపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సెటైర్లు వేశారు.  ఈ మేరకు ఆమె ఫేస్‌బుక్ ఖాతాలో స్పందిస్తూ… ఫెడరల్ ఫ్రంట్ పేరుతో గత మూడు నెలలుగా కేసీఆర్ ఆడిన డ్రామాకు తెరపడిందని అన్నారు.

చదవండి: మోడీకి మహర్షి సినిమాకి లింక్ పెట్టిన కుటుంబరావు…

కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తానని ప్రగల్బాలు పలికిన గులాబీ బాస్.. ఇప్పుడు దిక్కు తోచని స్ధితిలో ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోందని తెలిపారు. డీఎంకే అధినేత స్టాలిన్ ఇచ్చిన షాక్‌తో కేసీఆర్‌కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినట్లుందని అన్నారు.

కల్వకుంట్ల కుటుంబం కలలు కల్లలు అయ్యాయి

ఇక మాయమాటలు చెప్పి, రాష్ట్ర విభజన క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకున్న విధంగానే, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేద్దామనుకున్న కల్వకుంట్ల కుటుంబం కలలు కల్లలుగా మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు.

జగన్‌ని బుట్టలో వేసుకున్న విధంగానే, స్టాలిన్‌ని కూడా బురిడీ కొట్టించాలని కేసీఆర్ గజకర్ణ, గోకర్ణ విద్యలను ప్రదర్శించారు కానీ ఆ పప్పులు తమిళనాట ఉడకలేదని అన్నారు. అందుకే ఈ గిమ్మిక్కులనుకు తిప్పికొట్టి, స్టాలిన్ తన చాణక్యనీతిని ప్రదర్శించారని తెలిపారు.

ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయేలోనే డీఎంకే కొనసాగుతుందని చెప్పి, టీఆర్ఎస్ చీప్ ట్రిక్స్‌కు చెక్ పెట్టారని విజయశాంతి విమర్శించారు.

చదవండి: నిజమేనా?: ఉత్తమ్ పదవి ఊడిపోనుందా!? టీ-కాంగ్రెస్ వర్గాలలో జోరుగా చర్చ…
- Advertisement -