22.7 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ బాలయ్యకి పోటీగా జగపతిబాబు డ్యుయల్ రోల్..!

బాలయ్యకి పోటీగా జగపతిబాబు డ్యుయల్ రోల్..!

- Advertisement -

హైదరాబాద్: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా….కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ మాస్ కమర్షియల్ సినిమా తెరకెక్కబోతుంది. ‘రూలర్’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ఈ నెల 17 నుంచి ప్రారంభం కానుంది. రెగ్యులర్ షూటింగ్ కూడా అప్పటి నుంచే మొదలు అవుతుందని తెలుస్తోంది. సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్, హరిప్రియలు హీరోయిన్లగా నటిస్తున్నారు.

చదవండి: బాలయ్య కొత్త సినిమా: లేడీ విలన్ లేదు…జగపతిబాబు ఒక్కడే విలన్

ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలకృష్ణ.. మరోసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఒకటి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. .

ఇక ఈ సినిమాలో బాలకృష్ణను ఢీ కొట్టే విలన్ పాత్రలో కూడా జగపతి బాబు డ్యుయల్ రోల్‌లో చేయనున్నారు. అది కూడా బాలకృష్ణకి పోటీగా తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభియం చేయనున్నట్టు చెబుతున్నారు. చూడాలి మరి బాలకృష్ణ, జగపతిబాబు ద్విపాత్రాభినయంలో ఏ మేర ఆకట్టుకుంటారో.

చదవండి: రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన మెగా ప్రిన్స్!
- Advertisement -