అప్పుడు పద్మశ్రీ అవార్డు కొన్నారని అన్నారు: సైఫ్ అలీ ఖాన్

- Advertisement -

ముంబై: 2010లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌కి అప్పటి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడంపై…అనేక విమర్శలు వచ్చాయి. సీనియర్ హీరోలని పక్కనబెట్టి సైఫ్‌కి అవార్డు ఇవ్వడంపై చాలామంది విమర్శలు గుప్పించారు. సైఫ్ పద్మశ్రీ అవార్డుని కొనుకున్నారని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేశారు.

ఇక అప్పుడు జరిగిన విషయంపై సైఫ్ తాజాగా ఆర్భాజ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న చిట్ చాట్ షో లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అవార్డు రావడంపై పలువురు పలురకాలుగా వ్యాఖ్యానాలు చేశారని, పద్మశ్రీ కొనుకున్నారని అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి: జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటున్న కేజీఎఫ్ 2

అయితే అప్పుడు చిత్ర  పరిశ్రమలో ఉన్న చాలామంది సీనియర్లకు దక్కని ‘పద్మశ్రీ’ పురస్కారం తనకు దక్కడాన్ని చాలా ఇబ్బందిగా ఫీలైయ్యాను అని చెప్పుకొచ్చారు. దీంతో తనకు వచ్చిన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేయాలి అనుకున్నాని, కానీ అప్పుడు మా నాన్న మన్సూర్ అలీ ఖాన్… నువ్వు భారత ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే స్థాయిలో లేవన్నారని చెప్పారు.

అందుకే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని.. భారత  ప్రభుత్వం ఇచ్చిన ‘పద్మశ్రీ’ అవార్డును స్వీకరించానన్నారు.

చదవండి: వీకెండ్ వ్యవసాయంతో కలెక్షన్ల పంట పండిస్తున్న ‘మహర్షి’
- Advertisement -