సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో రియా చక్రవర్తిపై సీబీఐ ప్రశ్నల వర్షం.. ఏమేం అడిగారంటే?

- Advertisement -

ముంబై: బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో అతడి ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తిని ముంబైలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో సీబీఐ అధికారులు విచారించిన ఈ రోజు విచారించారు.

ద‌ర్యాప్తు అనంతరం రియా తిరిగి ఇంటికి చేరుకుంది. దర్యాప్తు అనంతరం బయటకు వచ్చిన రియా తనను చుట్టుముట్టిన మీడియాపై అరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

దర్యాప్తులో భాగంగా రియాను అధికారులు అడిగిన ప్రశ్నలు ఇవేనంటూ కొన్ని బయటకు వచ్చాయి. వాటిలో కొన్ని..

  • సుశాంత్ ఇంటిని ఎందుకు వ‌దిలివెళ్లావు? 
  • సుశాంత్ మృతి త‌ర్వాత అత‌డి కుటుంబ‌స‌భ్యుల‌కు ఫోన్ చేశావా?
  • సుశాంత్ మరణవార్త తెలిసిన వెంట‌నే అతడికి ఇంటికి వెళ్లారా?
  • మార్చురీకి ఎందుకు వెళ్ల‌లేదు?
  • సుశాంత్ మ‌ర‌ణానికి దారితీసిన అంశాల‌పై మీరేమనుకుంటున్నారు?
  • సుశాంత్ ఇంట్లో ప‌నిచేస్తున్న సిబ్బందిపై మీరు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు?
  • సుశాంత్ కు మీరేమైనా మందులు ఇచ్చారా?
  • సుశాంత్ కోసం మీరు ఎవరైనా డాక్ట‌ర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నారా?
  • సుశాంత్ బ్యాంకు కార్డులు మీరెప్పుడైనా వాడారా? 
- Advertisement -