సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో తొలి అరెస్ట్.. ఎన్‌సీబీ అదుపులో ఇద్దరు వ్యక్తులు

- Advertisement -

న్యూఢిల్లీ: బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో తొలి అరెస్ట్ జరిగింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది.

వీరిలో ఒకరు అబ్దుల్ బాసిత్. అతడికి సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండాతో సంబంధం ఉన్నట్టు ఎన్‌సీబీ పేర్కొంది. ముంబైలోని బాంద్రాలో అరెస్ట్ చేసినట్టు తెలిపింది.

మిరాండా, రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి సూచనల మేరకు మాదక ద్రవ్యాలను సేకరించినట్టు తమ వద్ద సమాచారం ఉన్నట్టు వివరించింది.

సుశాంత్ మాజీ మేనేజర్ అయిన మిరాండాను రియా చక్రవర్తి గతేడామి మేలో నియమించారు. సుశాంత్ ఇంటి నిర్వహణ, ఇతర ఖర్చుల వివరాలను మిరాండా చూసేవారు.

శామ్యూల్ డ్రగ్ సరఫరా, సుశాంత్ డబ్బును దుర్వినియోగం వంటివి చేశాడని సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాగా, సుశాంత్ మృతి కేసును విచారిస్తున్న సీబీఐ రియాను పలుమార్లు ప్రశ్నించింది.

తొలిసారిగా ఆమె తల్లిండ్రులు ఇంద్రజిత్ చక్రవర్తి, సంధ్యలను దాదాపు 8 గంటలపాటు సీబీఐ విచారించింది.

- Advertisement -