
హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 27వ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
అయితే, కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉంగరాలు, చేతికి కడియం, గరుత్మంతుడు బొమ్మతో ప్రీ లుక్ పీరియాడిక్ చిత్రంలా అనిపిస్తోంది.
‘‘పవన్‌కల్యాణ్‌గారు మీ 27వ చిత్రం పదిహేను రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది.
ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం..ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ.. హ్యాపీ బర్త్ డే పవన్‌కల్యాణ్’’ అని క్రిష్ ట్వీట్ చేశారు.
ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
@PawanKalyan గారు, #PSPK27 పదిహేన్రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది..
చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది..
ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం..
ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ #HBDPawanKalyan pic.twitter.com/PCVhIO3uxm— Krish Jagarlamudi (@DirKrish) September 2, 2020








