అచ్చెన్నాయుడి ఇంటికెళ్లి పరామర్శించిన చంద్రబాబు

- Advertisement -

విజయవాడ: ఈఎస్ఐ మందుల కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని ఆరెస్టయి, బెయిలుపై బయటకు వచ్చిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పరామర్శించారు.

దాదాపు 50 రోజుల తర్వాత చంద్రబాబు ఏపీకి రావడంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అచ్చెన్న ఇంటికి చేరుకున్నారు.

దాదాపు 80 రోజులు పాటు అచ్చెన్నాయుడు రిమాండ్‌లో ఉన్నారు. ఇటీవల ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ అయ్యారు.

కరోనా పాజిటివ్ రావడంతో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో అచ్చెన్న చేరారు. పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు.

ఈఎస్‌ఐ వైద్యసేవల కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడికి హైకోర్టు బెయిల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. విజయవాడ ఏసీబీ కోర్టులో పూచీకత్తు సమర్పించి బెయిల్‌ పొందాలని ఆదేశించింది.

అదే విధంగా కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని, దర్యాప్తునకు అందుబాటులో ఉండాలని కోర్టు షరతులు విధించింది.

- Advertisement -