హైదరాబాద్: తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 27న ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే పాత ఎంపీపీ, జెడ్పీల పదవీకాలం జూలై 4న ముగుస్తుండడంతో 5న కొత్త సభ్యుల ఎన్నిక జరుగుతుంది. అంటే ఈ నెల 27న ఫలితాలు వెలువడితే…నెల రోజుల దాటాక ఎంపీపీ, జెడ్పీ ఎన్నిక జరుగుతుంది.
ఇక ఇదే విషయంపై టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు గాంధీ భవన్‌లో డీసీసీల సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ… మే 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలొస్తే, ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌ల ఎన్నికను జూలై 5 తరువాత చేస్తారా? అని ఉత్తమ్ మండిపడ్డారు.
చదవండి: కాంగ్రెస్‌కి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు! వైసీపీ నేత సంచలన ప్రకటన…
ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌ల ఎన్నికకు చాలా ఎక్కువ సమయం ఉండటంతో ప్రలోభాలకు గురి చేసే అవకాశముందని తెలిపారు. దీనిపై ఈసీని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌ల ఎన్నికకు అంత ఎక్కువ సమయం తీసుకోవాల్సిన పరిస్థితే వస్తే, కౌంటింగ్‌నే నెల రోజులపాటు వాయిదా వేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.








