30 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home ఎన్ఆర్ఐ అమెరికా అద్భుతం: సూర్యుడికి అత్యంత సమీపంలోకి.. నాసా ‘పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌’…

అద్భుతం: సూర్యుడికి అత్యంత సమీపంలోకి.. నాసా ‘పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌’…

nasa
- Advertisement -

 

nasa

టంపా : సూర్యుడి ఉపరితలంపై పరిశోధనలకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ప్రయోగించిన పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌.. అద్భుతాన్ని సృష్టించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రయోగించిన ఈ ప్రోబ్‌.. అక్టోబర్‌ 29 నాటికి సూర్యుడికి అత్యంత సమీపంలోకి.. అంటే 42.73 మిలియన్‌ కిలోమీటర్ల దగ్గరకు వెళ్లిన తొలి మానవ నిర్మిత స్పేస్‌ క్రాఫ్ట్‌గా రికార్డు నమోదు చేసింది. ఈ విషయాన్ని సోమవారం ‘నాసా’ ఒక ప్రకటనలో పేర్కొంది.

తొలిసారిగా 1976 ఏప్రిల్‌లో జర్మన్‌-అమెరికా రూపొందించిన హెలియస్‌ 2 స్పేస్‌ క్రాఫ్ట్‌ సూర్యుని ఉపరితలానికి సమీపంగా 246,960 కిలోమీటర్ల దగ్గరికి ప్రయాణించిందని, ఈ రికార్డును ఇప్పుడు పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ అధిగమించిందని నాసా తెలిపింది. తమ అంచనా ప్రకారం 2024లో ఈ పార్కర్‌ సొలార్‌ ప్రోబ్‌ సూర్యుని ఉపరితలానికి అత్యంత సమీపంగా.. అంటే 3.83 మైళ్ళ దూరంలోకి వెళుతుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

- Advertisement -