29.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home ఎన్ఆర్ఐ అమెరికా చిగురుపాటి హత్య కేసు: హైదరాబాద్‌లోనే హత్య, కారులో ఓ యువతి కూడా.. అసలేం జరిగింది?

చిగురుపాటి హత్య కేసు: హైదరాబాద్‌లోనే హత్య, కారులో ఓ యువతి కూడా.. అసలేం జరిగింది?

Jayaram-Chigurupati-mudder-1
- Advertisement -

Jayaram-Chigurupati-mudder-1

హైదరాబాద్: ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో వెలుగులోకి వస్తున్న ఒక్కో నిజంతో పోలీసులే షాకవుతున్నారు. పెను సంచలనం సృష్టించిన ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు.. వెలుగు చూస్తున్న ఒక్కో నిజం చూసి విస్తుపోతున్నారు.

జయరాంను హైదరాబాద్‌లోనే హత్య చేశారని, బీరు బాటిల్‌తో తలపై కొట్టి చంపినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఆయన మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి ఐతవరం వద్ద రోడ్డు పక్కన కారులో వదిలేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే, ఆ సమయంలో కారును నడిపింది ఎవరు? కారును అక్కడ వదిలేసిన తర్వాత అతడు ఏమయ్యాడు? అన్నది మిస్టరీగా మారింది.

ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు టోల్‌గేట్ల వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కారులో జయరాంతోపాటు మరొకరు, లేదంటే ఇద్దరు ఉండి ఉంటారని, వారిలో ఓ యువతి కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఎవరన్నదానిపై ఆరా తీస్తున్నారు. పోలీసులకు లభ్యమైన సీసీటీవీ ఫుటేజీల్లో కారును జయరాం నడపడం లేదు. ఆయన వెనుక ఇద్దరు కూర్చున్నట్టు మసకగా కనిపిస్తోంది.

సాయంత్రానికి దర్యాప్తు కొలిక్కి…

జయరాం మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన పోలీసులు ఆయన బంధువులకు అప్పగించారు. విదేశాల్లో ఉన్న ఆయన భార్య, పిల్లలు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, జాతీయ రహదారిపై ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు సాయంత్రానికి మరిన్న కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే, జయరాం సమీప బంధువైన ఓ మహిళను నందిగామకు తీసుకొచ్చిన మరో బృందం అక్కడ విచారిస్తున్నట్టు సమాచారం.

- Advertisement -