

హైదరాబాద్: తన ప్రెగ్నెన్సీపై ఉచిత సలహాలిస్తున్న వారిపై టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ట్విట్స్ ద్వారా మండిపడింది. విషయం ఏమిటంటే.. ప్రస్తుతం సానియా నిండు గర్భిణి. ఈ నెలలోనే పండంటి బిడ్డకు ఆమె జన్మనివ్వనుంది. ఈ నేపథ్యంలో శనివారం నగరంలోని ఓ హోటల్లో తన సోదరి ఆనమ్ మీర్జా.. లేబుల్ బజార్ పేరిట ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనకు సానియా తన భర్త షోయబ్ మాలిక్‌తో కలిసి హాజరయింది.
దీంతో పలువురు ఆమె ఆరోగ్యం గురించి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ఉచిత సలహాలిస్తున్నారు. దీనిపై సానియా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ” ప్రెగ్నెన్సీ కారణంగా 9 నెలల పాటు టెన్నిస్‌కు దూరంగా ఉండవలసి రావడం కొంచెం బాధ కలిగిస్తున్నప్పటికీ… తల్లిని కాబోతున్నాననే ఆలోచన తనకు చాలా ఆనందాన్నిస్తోందని వ్యాఖ్యానించింది. భర్త షోయబ్ తనను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడని చెప్పింది.
??? pic.twitter.com/ylxQWfD8kY
— Sania Mirza (@MirzaSania) October 13, 2018
ప్రసవం తర్వాత ఆట కొనసాగిస్తా…
అంతేకాదు, ప్రసవం తరువాత కూడా మహిళలు తమ కెరీర్‌ను కొనసాగించవచ్చని, ఆరోగ్యం కాపాడుకుంటూ తమ రంగంలో ముందుకు సాగడంలో పెద్ద ఇబ్బందేమీ ఉండదని వ్యాఖ్యానించింది. ప్రసవం అనంతరం తాను తన కెరీర్‌ను కొనసాగిస్తానని స్పష్టం చేసింది. తన ప్రెగ్నెన్సీపై కొంతమంది చేస్తున్న కామెంట్స్, ఇస్తోన్న ఉచిత సలహాలు మాత్రం తనకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయని పేర్కొంది.
Word of advice for ppl(specially since the majority seem to be men) who think being pregnant means you have to go into hibernation for 9 months,sit at home and for some reason be ‘ashamed in this haalat’..So when women are pregnant they don’t have a disease or become untouchable-
— Sania Mirza (@MirzaSania) October 12, 2018
ఇలాంటి ఆలోచనలను కాస్త తీసివేయండి…
“సలహాలు ఇచ్చేవారు(అందులో ఎక్కువమంది మగవారు) గర్భం ధరించిన మహిళలు 9 నెలల పాటు బయటికి రాకుండా ఇంట్లోనే సుషుప్తావస్థలో ఉండాలనుకుంటున్నారు. ఈ స్థితిలో ఉన్నందుకు సిగ్గుతో ఇంట్లోనే ఉండిపోవాలని భావిస్తున్నారు. గర్భిణులు ఓ శవంగా ఇంట్లోనే పడి ఉండాలా? వారు కూడా సాధారణ మనుషులే. సాధారణ జీవితం గడపడానికి వారికి హక్కు ఉంది. ఇలాంటి ఆలోచనలను కాస్త తీసివేయండి. మీరెక్కడ్నించి వచ్చారు.. మీ తల్లి గర్భం నుంచే కదా..” అంటూ వరుస ట్వీట్లతో మండిపడింది.
Word of advice for ppl(specially since the majority seem to be men) who think being pregnant means you have to go into hibernation for 9 months,sit at home and for some reason be ‘ashamed in this haalat’..So when women are pregnant they don’t have a disease or become untouchable-
— Sania Mirza (@MirzaSania) October 12, 2018
సానియా భర్త షోయబ్ మాలిక్ మాట్లాడుతూ.. తమకు పుట్టబోయే చిన్నారి కోసం భారత్, పాక్ దేశాల్లోని తమ స్నేహితులు, అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని అన్నాడు. తన జీవితంలో తల్లి, భార్య ఇద్దరూ ఎంతో కీలకమని వ్యాఖ్యానించాడు.








