జైపూర్:భారత్ లో ‘జికా’ వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్ ను వణికిస్తోంది. ఇప్పటివరకు 55మందికి ఈ వైరస్ సోకినట్లు రాజస్తాన్ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు శనివారం ధృవీకరించారు. అయితే ఆందోళన పడాల్సిన అవసరం లేదని వారు పేర్కొంటున్నారు. ఎందుకంటే ‘జికా’ వైరస్ సోకిన 38 మంది చికిత్స పొందిన తరువాత వారి పరిస్థితి మెరుగైందని వైద్యులు పేర్కొంటున్నారు.
చదవండి: జైపూర్‌లో ’జికా‘ వైరస్.. పరీక్షల్లో ఏడుగురికి పాజిటివ్, అప్రమత్తమైన కేంద్రం
జైపూర్‌లోని ‘జికా’ కేసులు ఎక్కవగా ఉన్న ప్రాంతాల్లో వైద్యబృందాలు అప్రమత్తమయ్యాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ బృందాలు దోమ లార్వాల నమూనాలను సేకరిస్తున్నాయి. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఊరూరా ఫాగింగ్‌ని వైద్యులు కొనసాగిస్తున్నారు. 11 మంది గర్భిణిలకు ఈ జికా వైరస్ సోకిందాని తెలిపారు. అక్కడి పరిస్థతి పర్యవేక్షించడానికి ఢీల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ సెంటర్లో కంట్రొల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.