- Advertisement -
సోనిపట్: ప్రో కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండో విజయం సాధించింది. శనివారం జోన్-బిలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో టైటాన్స్ స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 9 పాయింట్లు,
మరో ఆటగాడు నీలేశ్ సోలంకి 5 పాయింట్లతో చెలరేగడంతో తెలుగు టైటాన్స్ 34-29 స్కోరుతో యూపీ యోధా జట్టుపై ఘన విజయం సాధించింది.
టాకిలింగ్‌లో అబోజర్ 6 పాయింట్లతో అకట్టుకున్నాడు. యాపీ యోధా తరపున ప్రశాంత్ 11 పాయింట్లు, రిషాంక్ దేవడిగ 7 పాయింట్లు సాధించారు.
మరో మ్యాచ్‌లో యు ముంబా ఘన విజయం…
జోన్ -ఎలో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో యు ముంబా 53-26 స్కోరుతో హర్యానా స్టీలర్స్‌పై గెలిచింది. యు ముంబా తరుపున అభిషేక్ సింగ్ 12 రైడ్ పాయింట్లు సాధించగా…
హర్యానా తరపున వికాస్ 9 రైడ్ పాయింట్లు సాధించాడు.
ప్రో కబడ్డీ లీగ్‌లో.. నేటి మ్యాచ్‌ల వివరాలు…
పట్నా పైరేట్స్ x యూపీ యోధా
ఫుణేరీ పల్టన్ x హర్యానా స్టీలర్స్
- Advertisement -