షాకింగ్: ఆపరేషన్ చేశారు.. కత్తెర వదిలేశారు! మరోసారి బయటపడ్డ నిమ్స్ వైద్యుల నిర్లక్ష్యం…

12:27 pm, Sat, 9 February 19
nims doctors vaikari

nims doctors vaikari

హైదరాబాద్: మన ఈ సమాజం లో దేవుడి తో సమానంగా చూసేది ఒక్క డాక్టర్ ని మాత్రమే. ఆ దేవుడు మనకి జన్మనిస్తే, డాక్టర్స్ పునర్జన్మని ప్రసాదిస్తారు. అలాంటి ఎంతో అత్యున్యత మైన స్థానంలో ఉన్న డాక్టర్లు కొందరు చేసే కొన్ని తప్పుల వల్ల మొత్తం డాక్టర్ వృత్తికే మచ్చ తెస్తున్నాయి.

ఆపరేషన్ చేశారు కానీ…

అందుకు నిదర్శనం తాజాగా హైదరాబాద్ నిమ్స్‌లో జరిగిన ఘటనే. నిమ్స్ వైద్యుల నిర్లక్ష్యం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. శస్త్రచికిత్స సమయంలో ఆపరేషన్‌కు ఉపయోగించిన కత్తెరను వైద్యులు కడుపులోనే మరిచిపోయారు.

మహేశ్వరి (33)అనే మహిళకు మూడు నెలల క్రితం హెర్నియా శస్త్రచికిత్స జరిగింది. అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యింది. అయితే, గత 15 రోజులుగా తరచూ కడుపునొప్పి రావడంతో రోగి మరోసారి ఆస్పత్రికి వచ్చింది. దీనితో ఆమెకి స్క్యానింగ్ తీయగా అసలు విషయం బయటపడింది.

కడుపులో కత్తెర ఉన్న విషయాన్ని వైద్యులు గుర్తించారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆస్పత్రి ఎదుట రోగి బంధువులు ఆందోళనకు దిగారు. ప్రాణాలని బ్రతికించుకోవడానికి ఆసుపత్రికి వస్తే, త్వరగా ఆపరేషన్ పూర్తిచేయాలనే నెపంతో డాక్టర్స్ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రస్తుతం కత్తెరను తొలగించేందుకు ఆ మహిళకు మళ్ళీ వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నారు.