మీపై ఫిర్యాదులొచ్చాయి.. అందుకే సేవలు నిలిపేశాం: సీఎం రమేష్‌కి షాక్ ఇచ్చిన వాట్సాప్!

12:09 pm, Sat, 9 February 19
cm ramesh vs whatsapp

cm ramesh vs whatsapp

ఆంధ్రప్రదేశ్:  ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఏదైనా చేస్తాం కానీ మొబైల్ ఫోన్ ని మాత్రం పక్కన పెట్టాం అనేంతలా పిచ్చి ముదిరిపోయింది. ప్రస్తుత రోజుల్లో అందరి స్మార్ట్ ఫోన్లో ఉన్న ఏకైక యాప్ వాట్సాప్. అంతలా దానికి అలవాటు పడిపోయారు. పిల్లలనుండి పెద్దవారి వరకు అందరూ వాట్సాప్ కి బాగా కనెక్ట్ అయ్యారు.

ఇకపోతే ఇటీవల కాలంలో తన వాట్సాప్‌ ఖాతా పనిచేయక పోవడంతో సీఎం రమేష్‌ వాట్సాప్ సంస్థకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సంస్థ ఈ విధంగా సమాచారం ఇచ్చింది. మీరు మా సంస్థ నియమ నిబంధనలు ఉల్లంఘించారు.

మీ నంబర్‌కు వాట్సాప్‌ సేవలు నిలిపివేస్తున్నాం….

మీపై చాలా ఫిర్యాదులు అందాయి. అందుకే మీ నంబర్‌కు వాట్సాప్‌ సేవలు నిలిపివేస్తున్నాం అని రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్‌కు వాట్సాప్‌ సంస్థ సమాచారం అందించింది. అయితే ఫిర్యాదు దారుని వివరాలు మాత్రం వాట్సాప్‌ యాజమాన్యం బయటపెట్ట లేదు. వినియోగదారుల వ్యక్తిగత గోప్యత కాపాడే చర్యల్లో భాగంగా ఆ వివరాలు ఇవ్వలేమని వాట్సాప్ స్పష్టం చేసింది. కాగా, కేంద్ర ప్రభుత్వమే తన ఖాతాను బ్యాన్‌ చేయించిందని సి.ఎం.రమేష్‌ ఆరోపిస్తున్నారు.

చదవండి: బాబుతో భేటీ: అయినా అసంతృప్తే, పార్టీ మారడంపై తేల్చని ‘ఆమంచి’, ఏమన్నారంటే…