మమ్ముట్టిలో వైఎస్సే కనిపించారు: ‘యాత్ర’ మూవీపై కొడాలినాని స్పందన!

12:51 pm, Sat, 9 February 19
kodalli nani response on yatra

kodalinani respond on ysr biopic

ఆంధ్రప్రదేశ్ : మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి జీవితాల్లోని కీలక ఘట్టం అయిన పాదయాత్రని కథాంశంగ తీసుకోని తెరకెక్కించిన చిత్రం యాత్ర. ఈ చిత్రానికి డైరెక్టర్ మహి దర్శకత్వ భాద్యతలు నిర్వహించాడు. ఇక సినిమాలో కీలకమైన వైఎస్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించాడు.

అలాగే ఈ సినిమాలో వై ఎస్ తండ్రి పాత్రలో జగపతిబాబు మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. అలాగే ఇతర కీలకపాత్రలలో అనసూయ, సుహాసిని, రావురమేష్ నటించారు. ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

యాత్ర మరో అద్భుతం..

సినిమా చుసిన ప్రతిఒక్కరు కూడా మళ్ళీ వై ఎస్ గుర్తుకువచ్చాడు అని చెప్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని యాత్ర సినిమా పై తన స్పందన తెలియజేసాడు.వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా అందరి గుండెలను తాకిందని గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొడాలి నాని తెలిపారు. సంక్షేమ పథకాల ఆవిర్భావానికి ఈ పాదయాత్ర పెద్దపీట వేసిందన్నారు.

సినిమాలో మమ్ముట్టి గారిని చూస్తున్నంతసేపు వైఎస్ మాత్రమే కనిపించారని వ్యాఖ్యానించారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మహి.వి.రాఘవ్, యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు నాని ట్విట్టర్ లో స్పందించారు. అంతకుముందు గుడివాడలో అభిమానులు, వైసీపీ కార్యకర్తలతో కలిసి యాత్ర సినిమాను చూసిన నాని కేకు కోసి సంబరాలు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

‘యాత్ర’ ప్రీమియర్ షో తొలి టికెట్‌ ధర.. ఎంతో తెలుసా!?

మన గడప తొక్కి సాయం అడిగిన ఆడ బిడ్డతో రాజకీయం ఏంట్రా? యాత్ర ప్రీమియర్స్ షో టాక్?

మీకు ఆ హక్కు ఉంది: ‘యాత్ర’ నెగెటివ్ టాక్‌పై డైరెక్టర్ స్పందన!