రాఫెల్‌ యద్ధ విమానాల కొనుగోలులో భారీ కుంభకోణం: ఉత్తమ్‌ కుమార్ రెడ్డి

uttam-kumar-reddy
- Advertisement -

uttam-kumar-reddyహైదరాబాద్: రాఫెల్‌ యద్ధ విమానాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వీటి కొనుగోళ్లలో అనేక అనుమానాలున్నాయని అన్నారు. తాను కూడా ఓ పైలట్‌నేనని, యుద్ధ విమానంలో ట్రైనర్‌ని అని, తాను చైనా, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో కూడా పని చేశానని వ్యాఖ్యానించారు.

గతంలో యుద్ధ సామగ్రి కొనుగోలు చేసేటప్పుడు సీక్రెట్‌ మెయింటేన్‌ చేయలేదని.. మరి ఇప్పుడు అంత సీక్రెట్‌గా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. యుద్ధ విమానాల ధరలు చెప్పడం వల్ల దేశ భద్రతకు ఎలా భంగం కలుగుతుందో ప్రధాని మోడీ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాఫెల్ డీల్ సీక్రెట్‌గా ఉంచాలని ఫ్రాన్స్ ఎక్కడా చెప్పలేదని.. యుద్ధ విమానాల ప్రత్యేకతలు, వాటి సామర్థ్యాలను రహస్యంగా  ఉంచుతారని, వాటి ధరలు రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.

అంతేకాదు, విమానాల తయారీలో అసలు రిలయన్స్‌ అనిల్ అంబానీకి అనుభవం లేదని, ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్‌ కాంట్రాక్ట్‌ హెచ్‌ఏఎల్‌కు కాకుండా రిలయన్స్‌కు ఎందుకు ఇచ్చారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు.  మోడీ ప్రధాని కాకముందునుంచే హెచ్‌ఏఎల్‌‌తో ఒప్పందం ఉందని, అయినా సరే హెచ్‌ఏఎల్‌ కంపెనీని కాదని.. అనిల్‌ అంబానీ కంపెనీకి కాంట్రాక్ట్‌ ఇవ్వడం వెనక మతలబేంటని ప్రశ్నించారు.

 

 

- Advertisement -