- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో ఈ నెల 7న( శుక్రవారం) ఎన్నికలు జరగనుండడంతో రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అలాగే పోలింగ్ ఏర్పాట్లలో భాగంగా గురువారం కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
ఇక శని, ఆదివారాలు సాధారణ సెలవులు. దీంతో వరుసగా నాలుగు రోజుల సెలవుల రావండంతో మళ్ళీ సోమవారం తిరిగి విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. అయితే, మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఓట్లను లెక్కింపు జరిగే విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు మంగళవారం కూడా సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
దీంతో వరుసగా విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఐదు రోజులపాటు సెలవులు వచ్చినట్లయింది.
- Advertisement -