హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

krishna-nagar-fire-accident
- Advertisement -

krishna-nagar-fire-accidentహైదరాబాద్: సినీ రంగానికి చెందిన వర్థమాన తారలు, జూనియర్ ఆర్టిస్టులు అధికంగా నివాసం ఉండే హైదరాబాద్‌లోని కృష్ణ‌నగర్‌లో గురువారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 12 గంటల సమయంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆడిటోరియం పక్కనున్న నాలుగంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి.

వసంత హార్డ్ వేర్ అండ్ పెయింట్స్ దుకాణంలో మంటలు వ్యాపించగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు శ్రమించారు. వసంత హార్డ్‌వేర్ స్టోర్‌లో రంగులు, రసాయనాలు అధికంగా ఉండటంతో మంటలు అంత తొందరగా అదుపులోకి రాలేదు.

ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మొదట అధికారులు ఆ భవనంలోని వారందరినీ ఖాళీ చేయించారు.  క్రేన్ సాయంతో గోడలను పగులగొట్టి, విద్యుత్ సరఫరా నిలిపివేయించి, లోపలికి నీరు చిమ్మారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను కూడా ఖాళీ చేయించారు. ఈ ఘటనలో సుమారు రూ. 25 లక్షల మేరకు ఆస్తి నష్టం కలిగివుండవచ్చని వసంత హార్డ్ వేర్ అండ్ పెయింట్స్ స్టోర్ యాజమాన్యం అంచనా.  కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్లనే అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

- Advertisement -