25.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి రారు.. పార్లమెంట్‌కు పోరు.. వీళ్లు మనకెందుకు?: వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై దేవినేని ఉమ నిప్పులు

అసెంబ్లీకి రారు.. పార్లమెంట్‌కు పోరు.. వీళ్లు మనకెందుకు?: వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై దేవినేని ఉమ నిప్పులు

minister-devineni-uma
- Advertisement -

minister-devineni-uma

అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారని, ఎంపీలు పార్లమెంట్‌కు పోరని ఏపీ మంత్రి దేవినేని ఉమ ఎద్దేవా చేశారు.  అంతేకాదు, రాష్ట్ర ప్రయోజనాలు పట్టని ఇలాంటి నాయకుల అవసరం ప్రజలకు లేదని ఆయన విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఉదయం మీడియాతో మంత్రి ఉమ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజించిన వారే ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నేతలే బీజేపీ, వైసీపీ నేతలుగా, ఆపై జనసేన నేతలుగా రూపాంతరం చెందుతున్నారని, ఈ మూడు పార్టీలూ తోడు దొంగలేనని ఎద్దేవా చేశారు. బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, ధర్మాన ప్రసాదరావులు పదేళ్ల పాటు మంత్రులుగా ఉండి రాష్ట్ర ప్రజలకు చేసిందేమిటి? అని మంత్రి ఉమ ప్రశ్నించారు.  వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీ అధినేత జగన్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఆయన నిప్పులు చెరిగారు.

- Advertisement -