22.7 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ 79 ఏళ్ల చరిత్రలో అతిపెద్ద ప్రమాదం: స్టాల్స్‌ నిర్వాహకులను ఆదుకుంటామన్న ఈటెల, ఎగ్జిబిషన్‌కు 2 రోజుల...

79 ఏళ్ల చరిత్రలో అతిపెద్ద ప్రమాదం: స్టాల్స్‌ నిర్వాహకులను ఆదుకుంటామన్న ఈటెల, ఎగ్జిబిషన్‌కు 2 రోజుల సెలవు

nampally-exhibition
- Advertisement -

హైదరాబాద్‌: నాంపల్లిలోని భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌)లోజరిగిన భారీ అగ్ని ప్రమాద నష్టంపై విచారణ జరుపుతున్నామని, నివేదిక ఆధారంగా స్టాల్స్‌ నిర్వాహకులను ఆదుకుంటామని మాజీ మంత్రి, ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ ఈటెల రాజేందర్‌ అన్నారు. గురువారం ఈటెల అధ్యక్షతన పాలకవర్గ సమావేశం నిర్వహించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టంపై చర్చించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 79 ఏళ్ల నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ చరిత్రలో ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడూ జరగలేదన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం నుమాయిష్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై ఆస్తి నష్టపో్యిన వారితోపాటు ఎగ్జిబిషన్ కమిటీ కూడా తీవ్రంగా బాధపడుతోందని రాజేందర్ అన్నారు.

కాశ్మీర్ నుంచి వ్యాపారులు ఏ ఆశతో వచ్చారో అదే ఆశతో వెళ్లేలా కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారని చెప్పారు. నలభై ఏళ్లుగా స్టాళ్ల నిర్వాహకులతో తాము కుటుంబంగా కలిసి పనిచేస్తున్నామన్నారు.

ప్రమాదం దృష్ట్యా ఈరోజు, రేపు(గురువారం, శుక్రవారం) రెండు రోజులపాటు ఎగ్జిబిషన్‌ను నిలిపివేస్తున్నట్లు ఈటెల ప్రకటించారు. స్టాళ్లను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు.

పేద ప్రజలు, విద్యార్థుల కోసమే..

ఎగ్జిబిషన్ సొసైటీ ప్రైవేటు సంస్థ కాదని.. ఒక లక్ష్యం కోసం ఏర్పడిందని మాజీ మంత్రి వివరించారు. వ్యాపారం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే సంస్థగా ఈటెల పేర్కొన్నారు. సొసైటీ ద్వారా వచ్చే లాభాలను పేద ప్రజలు, విద్యార్థుల కోసం వినియోగిస్తున్నట్లు చెప్పారు. స్టాళ్ల యాజమానులకు భోజనం ఇతర వసతులు కల్పిస్తున్నామన్నారు.

అగ్ని ప్రమాద ఘటనపై సాయంత్రానికి నివేదిక వస్తుందని.. త్వరగా సహాయం చేస్తామని ఆయన వివరించారు. ప్రమాదం జరిగిన కారణంగా నుమాయిష్‌కు నాలుగైదు రోజు గడువు పొడిగిస్తామని మాజీ మంత్రి వివరించారు.

సంబంధిత వార్తలు


- Advertisement -