ప్రముఖ సినీ హాస్య నటుడు వేణుమాధవ్ తెలంగాణతలో జరగనున్నఎన్నికలలో పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వేణుమాధవే స్వయంగా మీడియాకి వెల్లడించారు. ఆయన స్వయంగా ఈ గురువారం ఉదయం 11 గంటలకు కోదాడలో స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేయనున్నట్లు వెల్లడించారు.
మొదటి నుండి తెలుగుదేశం ప్రచార కార్యక్రమలలో పాల్గొంటూ…
కమెడియన్ వేణుమాధవ్ సొంత ఊరు సూర్యపేట జిల్లాలోని కోదాడ. ఆయన అక్కడే చదువు పూర్తి చేసుకొని మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడంతో ఆ పార్టీ సభల్లో పాల్గొని తన మిమిక్రీ పోగ్రాములు దార్వా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేవాడు.
ఆయన తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని కూడా అలాగే టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. దీంతో ఆయన టీడీపీ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తారనుకుంటే అనూహ్యంగా కోదాడ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటి చేస్తున్నారు.
రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం నుండే…
కొన్ని వందల సినిమాల్లోకమెడియన్‌గా నటించిన వేణుమాధవ్ రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన వారే. కోదాడ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని నిర్ణం తీసుకన్నట్లు ఆయన మీడియాకి తెలిపారు.