25.7 C
Hyderabad
Monday, August 17, 2026
- Advertisement -
Home ట్రెండింగ్ న్యూస్ వాహనదారులకు అలర్ట్: కేబీఆర్ పార్క్ వద్ద మారిన రూట్!

వాహనదారులకు అలర్ట్: కేబీఆర్ పార్క్ వద్ద మారిన రూట్!

- Advertisement -

హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ పార్క్ (KBR Park) పరిసరాల్లో ప్రయాణించే వాహనదారులకు నగర ట్రాఫిక్ పోలీసులు కీలక అప్‌డేట్ ఇచ్చారు. పార్కు చుట్టూ అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ నెల 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ ‘వన్ వే’ (One-Way) విధానాన్ని అమలు చేయనున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. ఈ మార్పుల కోసం ఇప్పటికే అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు.

వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్లపై లేన్ మార్కింగ్‌లు, సైన్ బోర్డులు, లేన్ ఛేంజర్‌లను సిద్ధం చేశామన్నారు. ప్రయాణికులు సులభంగా తమ మార్గాలను ఎంచుకునేందుకు వీలుగా గూగుల్ మ్యాప్స్/నావిగేషన్‌లోనూ అవసరమైన రూట్ మార్పులను చేర్చినట్లు వివరించారు. ముఖ్యమైన కూడళ్ల వద్ద నిరంతరం సహాయం అందించేందుకు 24/7 ట్రాఫిక్ సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు.

అంతేకాకుండా, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీటీవీ నెట్‌వర్క్ సహకారంతో ట్రాఫిక్ ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని సీపీ తెలిపారు. ట్రాఫిక్ రద్దీ తీవ్రతను అంచనా వేసేందుకు డ్రోన్ల ద్వారా కూడా రియల్-టైమ్ పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ప్రారంభంలో పరిస్థితులను సమీక్షించి అవసరమైన మార్పులు చేస్తామని, కాబట్టి వాహనదారులు ఈ వన్ వే విధానాన్ని గమనించి ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

- Advertisement -