25.7 C
Hyderabad
Monday, August 17, 2026
- Advertisement -
Home ట్రెండింగ్ న్యూస్ హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. కోకాపేటలో గ్రాండ్ ఎంట్రీ!

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. కోకాపేటలో గ్రాండ్ ఎంట్రీ!

- Advertisement -

హైదరాబాద్: భాగ్య‌న‌గ‌రం రియల్ ఎస్టేట్ రంగానికి మరో అంతర్జాతీయ గుర్తింపు లభించనుంది. నగరంలోని అత్యంత విలాసవంతమైన, కీలక వ్యాపార ప్రాంతమైన కోకాపేటలో ప్రతిష్ఠాత్మ‌క‌ ‘ట్రంప్ టవర్స్’ (Trump Towers) నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ‘ట్రంప్ ఆర్గనైజేషన్’ భాగస్వామ్యంతో భారతదేశంలో చేపడుతున్న ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగా హైదరాబాద్‌లో ఈ మెగా వెంచర్‌ను నిర్మించేందుకు సన్నాహాలు వేగవంతమయ్యాయి.

అంతర్జాతీయ స్థాయి నిర్మాణ శైలి, అత్యంత ఆధునిక సదుపాయాలు, విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ స్పేస్‌లతో ఈ ఐకానిక్ భవనాలను రూపుదిద్దనున్నారు.

ఇప్పటికే ముంబై, పుణె, గురుగ్రామ్, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో ట్రంప్ టవర్స్ ప్రాజెక్టులు అందుబాటులో ఉండగా… ఇప్పుడు భాగ్యనగరంలోనూ ఈ బ్రాండ్ అడుగుపెడుతుండటం గమనార్హం. ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలో ఉండే కోకాపేటలో ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల నగర ప్రీమియం రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మరింత ఊపు రానుందని రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

- Advertisement -