24.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ ‘గోల్కొండ టైగర్’ బద్దం బాల్ రెడ్డి ఇక లేరు

‘గోల్కొండ టైగర్’ బద్దం బాల్ రెడ్డి ఇక లేరు

baddam bal reddy
- Advertisement -

baddam bal reddy

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ‘గోల్కొండ టైగర్’ బద్దం బాల్‌రెడ్డి కన్ను మూశారు. బంజారా హిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.

చిన్న పేగు సంబంధిత కేన్సర్‌తో కొంత కాలంగా బాధ పడుతున్నారు బద్దం బాల్ రెడ్డి. అయితే, క్రమంగా కాలేయానికి కూడా కేన్సర్‌ సోకింది. దీంతో ఫిబ్రవరి 10న కేర్ ఆసుపత్రిలో చేర్పించారు.

ఫిబ్రవరి 13న చిన్న పేగుకి కేర్ ఆస్పత్రి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పై ఉంచి వైద్యం అందించారు. శనివారం ఆరోగ్యం మరింత విషయమించడంతో తుది శ్వాస విడిచారు.

గోల్కొండ టైగర్‌గా..

పాత బస్తీ అలియాబాద్ జంగమ్మెట్ ప్రాంతానికి చెందిన బాల్ రెడ్డి, బీజేపీ పటిష్టానికి విశేషమైన కృషి చేశారు. బాల్ రెడ్డిని.. ఆయన కార్యకర్తలు గోల్కొండ టైగర్ అంటూ పిలిచేవారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బద్దం బాల్ రెడ్డి.. పార్టీకి, ప్రజలకు సేవలందించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి పోటీ చేసిన స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.

బాల్ రెడ్డి మృతి పట్ల బీజేపీ నేతలతోపాటు ఇతర పార్టీల నేతలు కూడా సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. బాల్ రెడ్డి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -