తెలంగాణ కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు చోటు: కేసీఆర్ కీలక ప్రకటన

kcr
- Advertisement -

kcr
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర మంత్రిమండలిలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని కేసీఆర్ తెలిపారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

శుక్రవారం కేటాయించిన ఎమ్మెల్సీ సీట్లలో కూడా కూడా ఓ మహిళకు స్థానం కల్పించినట్లు తెలిపారు. మంత్రివర్గం విస్తరణ పరిధి మనకున్నది 17. రాబోయే రోజుల్లో ఇంకా ఆరుగురిని తీసుకోనేది ఉంది. దాంట్లో ఇద్దరి మహిళలకు చోటు కల్పిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో తొలిసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మహిళా మంత్రులు ఒక్కరికి కూడా చోటు కల్పించని విషయం తెలిసిందే.

మహిళలకు అధిక ప్రాధాన్యం..

ఇది ఇలా ఉండగా, తమ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. మహిళా ఓటర్ల వల్లే తాము అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పి వాటిని మహిళా సంఘాలకే అప్పగించాలని యోచిస్తున్నట్లు సీఎం తెలిపారు.

మహిళా సంఘాలకు ఇచ్చే వడ్డీలేని రుణాలను రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం చెప్పారు. వాటి మీద వడ్డీ కూడా ఎప్పటికప్పుడు విడుదల చేసేలా ఏర్పాట్లు చేసినట్లు సీఎం పేర్కొన్నారు. ఇక కౌలు రైతులకు రైతు బంధు పథకం అమలు సాధ్యం కాదని ముఖ్యమంత్రి మరోమారు స్పష్టంచేశారు.

సాగునీటి ప్రాజెక్టుల కోసమే అప్పులు చేస్తున్నామని, వాటిని తీర్చే సత్తా తెలంగాణ రాష్ట్రానికి ఉందని చెప్పారు. విపక్ష సభ్యుల తీరుపై మండిపడ్డారు. అవగాహన లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాగా, శనివారం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం తెలిపింది.

చదవండితెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్: కేటాయింపులివే…

- Advertisement -