

అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యుల్ విడుదలైంది. ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు…
తెలంగాణలోని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు కూడా నోటిఫికేషన్ విడులైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదలైంది. రెండు రాష్ట్రాల్లోనూ వచ్చే నెల మార్చి 22న ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 26న ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.
నామినేషన్ల దాఖలుకు వచ్చే నెల 5 చివరి తేదీ కాగా, ఆరో తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 8వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. మార్చి 22న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు.








