28.3 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం మార్కెట్లో అభినందన్ చీరలు! నయా ట్రెండ్!

మార్కెట్లో అభినందన్ చీరలు! నయా ట్రెండ్!

abhinandhan sarees
- Advertisement -

సూరత్: భారత వాయుసేన పైలట్ అభినందన్ వర్ధమాన్ కు దేశంలో బ్రహ్మరథం పడుతున్నారు. పాకిస్థాన్ కస్టడీ నుంచి రిలీజైన ఈ వింగ్ కమాండర్ క్రేజ్ ఇప్పుడు అంతాఇంతా కాదు.

యూత్ అతనిలాగే మీసాలు పెంచాలని ప్రయత్నిస్తుంటే, అతివలు అతని ముఖచిత్రం ప్రింట్ చేసిన చీరలు ధరించేందుకు విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆడవాళ్లలో ఈ ట్రెండ్ ను గమనించిన సూరత్ వస్త్ర వ్యాపారులు అభినందన్ ముఖచిత్రంతో చీరలను రూపొందిస్తున్నారు.

సూరత్ వస్త్రవ్యాపారుల కొత్త ఎత్తుగడ…

విశేషం ఏమిటంటే, ఈ ప్రింటెడ్ శారీస్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే అమ్ముడైపోతున్నాయట. దాంతో విక్రయదార్లు సూరత్ బట్టల మిల్లులకు భారీగా ఆర్డర్లు ఇస్తున్నారట.

ప్రస్తుతం గుజరాత్ లో ప్రారంభమైన ఈ ట్రెండ్ రాబోయే రోజుల్లో దేశం మొత్తం పాకిపోయినా ఆశ్చర్యపోనవసరంలేదు. ఈ చీరలపై అభినందన్ చిత్రంతో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ ను కూడా ముద్రించినట్టు దీనికి సంబంధించిన ఫొటోలను చూస్తే అర్థమవుతుంది.

చదవండి:‘‘అభినందన్’ అర్థం మారిపోయింది.. భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది..’’

 

- Advertisement -