30 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం మీది 56 అంగుళాల ఛాతీీ.. మిమ్మల్ని నేనెలా కొట్టగలను?: మోడీపై మమత సెటైర్లు…

మీది 56 అంగుళాల ఛాతీీ.. మిమ్మల్ని నేనెలా కొట్టగలను?: మోడీపై మమత సెటైర్లు…

mamata-banerjee-challenge-to-pm-modi
- Advertisement -

కోల్‌కతా: ప్రధాని మోడీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ హేమాహేమీలు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు.

ఇటీవల మోడీ అంత అబద్ధాలకోరును ఎప్పుడూ చూడలేదని, ఆయన మళ్లీ ఎన్నికైతే ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుందని, కాబట్టి మోడీకి ప్రజాస్వామ్యం చెంపదెబ్బ రుచి చూపించాల్సిన అవసరముందని మమత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చదవండి: ఆరోపణలు నిరూపించు.. లేకపోతే 100 గుంజీళ్లు తీయాలి: మోడీకి మమత సవాల్

ఇక ఈ వ్యాఖ్యలకు మోడీ కౌంటర్ ఇస్తూ…. దీదీ తనని చెంపదెబ్బ కొట్లాలనుకుంటోందని, ఆమెను తన సోదరిగా భావిస్తునని చెప్పారు. ఇక మీ చెంపదెబ్బ తనకు ఆశీస్సులతో సమానమని, కానీ, చిట్ ఫండ్ పేరుతో జనం డబ్బులు దోచుకున్న వారిని కొట్టే ధైర్యం ఉందా అని అడిగారు.

మళ్ళీ మమత కౌంటర్….

ఈ నేపథ్యంలోనే మమత మరోసారి మోడీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఈరోజు బెంగాల్‌లోని బషిర్హాట్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, తాను మోడీని కొడతాననలేదని, ప్రజాస్వామ్యం దెబ్బ రుచి చూపిస్తానని మాత్రమే అన్నానని మమత పేర్కొన్నారు.

అయినా మిమ్మల్ని నేనెందుకు కొడతాను? ఒకవేళ కొడితే నా చేయి విరిగిపోతుంది. ఆ పని నేనెందుకు చేయాలి? మీది 56 అంగుళాల ఛాతి. మిమ్మల్ని నేనెలా కొట్టగలను? మిమ్మల్ని కొట్టాలని కానీ కనీసం ముట్టుకునే ఉద్దేశం కానీ నాకు లేదు’ అని మోడీపై మమత సెటైర్ల వర్షం కురిపించారు.

చదవండి:  మోడీపై విమర్శలు: ప్రియాంక, మమతలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సుష్మా

 

- Advertisement -