25.6 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది మృతి, కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి…

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది మృతి, కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి…

- Advertisement -

కర్నూలు: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది దుర్మరణం పాలవగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

హైదరాబాద్‌ నుంచి బెంగళూరువైపు అతివేగంతో వెళ్తున్న ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు వెల్దుర్తిలోని ఓ మలుపు వద్ద ఎదురుగా వస్తోన్న ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో డివైడర్‌ను దాటి గద్వాల వైపు వెళ్తున్న తుఫాన్‌ వాహనాన్ని ఢీకొంది.

గుంతకల్లులో వివాహ నిశ్చితార్థ వేడుక ముగించుకొని ఆ తుఫాన్ వాహనంలో తిరిగి వస్తున్న వారిలో 13 మంది అక్కడిక్కడే మృతి చెందగా.. చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా పలువురు క్షతగాత్రులను దగ్గరలోని హాస్పిటల్‌కి తరలించారు.

కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి…

అయితే మృతులు తెలంగాణకి చెందిన గద్వాల జిల్లా రామాపురం వాసులే కావడంతో ఈ వార్త వినగానే కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ గద్వాల జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

ఇక ఈ దుర్ఘటనపై ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

చదవండి: ఇది మరీ దారుణం: రూ.10 పార్కింగ్ ఫీజు కోసం మనిషినే చంపేశారుగా…
- Advertisement -