అదిరిపోయే ఫీచర్లతో.. మోటోరోలా వ‌న్ విజన్‌, షార్ప్‌ ఆక్వియస్ ఆర్3…

motorola-one-vision-sharp-aquos-r3
- Advertisement -

ముంబై: వినియోగదారులని ఆకట్టుకోవడానికి ప్రముఖ మొబైల్స్ తయారీదారు మోటోరోలా అదిరిపోయే ఫీచర్లతో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్‌ మోటోరోలా వ‌న్ విజన్‌ను  త్వరలో విడుద‌ల చేయ‌దానికి సిద్ధమైంది. 4 జీబీ ర్యామ్ కెపాసిటీ గల ఈ ఫోన్ రూ.23,400 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది.

మోటోరోలా వ‌న్ విజ‌న్ ఫీచ‌ర్లు… Motorla-One-Vision-leak

6.3 ఇంచ్ డిస్‌ప్లే, ఎగ్జినోస్ 9609 ప్రాసెస‌ర్‌
4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్
48 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా
25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ 9.0 పై, 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ

చదవండి: ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తున్న వివో ఎస్1 ప్రొ…

షార్ప్ ఆక్వియస్  ఆర్ 3..

ఇక మరో ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు దిగ్గజం షార్ప్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఆక్వియ‌స్ ఆర్‌3 ని త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. 6 జీబీ ర్యామ్ కెపాసిటీ గల ఈ ఫోన్ ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు.

షార్ప్ ఆక్వియ‌స్ ఆర్3 ఫీచ‌ర్లు…

  • 6.2 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 3120 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌
  • 64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
  • ఆండ్రాయిడ్ 9.0 పై, 12.2, 20.1 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
  • 16.3 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
  • డాల్బీ అట్మోస్‌, 4జీ ఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0
  • యూఎస్‌బీ టైప్ సి, 3200 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌
చదవండి: ఆకట్టుకునే ఫీచర్లతో హువావే, రియల్ మీ కొత్త ఫోన్లు…

 

- Advertisement -