29.2 C
Hyderabad
Thursday, October 15, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ఆరోదశలో 59స్థానాలకు ప్రారంభమైన పోలింగ్! ఓటుహక్కు వినియోగించుకున్న కోహ్లీ, గంభీర్

ఆరోదశలో 59స్థానాలకు ప్రారంభమైన పోలింగ్! ఓటుహక్కు వినియోగించుకున్న కోహ్లీ, గంభీర్

six producer
- Advertisement -

ఢిల్లీ: దేశంలో సుదీర్ఘంగా కొనసాగుతున్న పార్లమెంటు ఎన్నికల ప్రక్రియలో ఆరో దశ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం దిల్లీల్లో విస్తరించి ఉన్న 59 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఈరోజు పోలింగ్ జరుగుతున్న 59 స్థానాల్లో 46 సీట్లను 2014 ఎన్నికల్లో బీజేపీ గెల్చుకుంది. యూపీఏ 11 సీట్లతో సరిపెట్టుకుంది.

ఏ రాష్ట్రంలో ఎన్ని స్థానాలు…

ఉత్తర ప్రదేశ్‌: 14 స్థానాలు

హరియాణా: 10 స్థానాలు

పశ్చిమ బెంగాల్: 8 స్థానాలు

బిహార్: 8 స్థానాలు

మధ్యప్రదేశ్‌: 8 స్థానాలు

దిల్లీ: 7 స్థానాలు

ఝార్ఖండ్ : 4 స్థానాలు

ఉదయం 9.00 : హరియాణాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి బారులు తీరిన మహిళలు

ఉదయం 8.30 : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాలన్నింట్లో ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నా. ముఖ్యంగా యువత భారీగా రికార్డు స్థాయిలో తరలిరావాలి. వారి భాగస్వామ్యమే పోలింగ్‌కు ఓ ప్రత్యేకతనిస్తుంది” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ఉదయం 8.30: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురుగ్రామ్‌లోని పైన్‌క్రెస్ట్ స్కూల్ ప్రాంగణంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన విరాట్ కోహ్లీ తన ఓటును వేశారు.

ఉదయం 8.25: తూర్పు దిల్లీ తరపున బీజేపీ తరపున లోక్‌సభకు పోటీచేస్తున్న గౌతం గంభీర్ ఓల్డ్ రాజేంద్ర నగర్‌ పోలింగ్ స్టేషన్‌లో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -