
అమరావతి: 2019 ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మాదాసు గంగాధర్, నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్‌తో పాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు.
భవిష్యత్తులో పార్టీ తరపున నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలి, గ్రామస్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి. అనే విషయాలపై అభ్యర్థులకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.
ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు అనుభవాలు, ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను జనసేనాని అడిగి తెలుసుకున్నారు. కాగా.. పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించాల్సిన అంశాలపై ప్రస్తుతం చర్చిస్తున్నారు.
ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ పర్యటించే అవకాశాలున్నాయి. పార్టీ కార్యక్రమాలపై నేడు షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. అభ్యర్థుల భేటీ అనంతరం పవన్ మీడియా మీట్ నిర్వహిస్తారని సమాచారం.








