
అమరావతి: ఏపీలో అధికారం తమదే అనే ధీమాలో ఉన్న విపక్ష వైసీపీ, కేంద్రంలోనూ తమ పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తుందని గట్టిగా భావిస్తుంది. కేంద్రంలో హంగ్ వస్తే ఏదో ఒక కూటమిలో చేరనున్న వైసీపీకి కచ్చితంగా కొన్ని మంత్రి పదవులు లభించడం ఖాయం. అదే జరిగితే ఆ పదవులు జగన్ ఎవరికి ఇప్పిస్తారనే అంశంపై కూడా వైసీపీలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
రాష్ట్రస్థాయిలో జగన్ కేబినెట్‌లో ఎవరు మంత్రులుగా ఉంటారనే ఊహాగానాలు ఓ వైపు వినిపిస్తుండగా, తాజాగా కేంద్రంలో వైసీపీ తరపున ఎవరు మంత్రులుగా ఉండే అవకాశం ఉందనే దానిపై కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: తండ్రి మరణంతో కుప్పకూలిపోయిన వైసీపీ కీలకనేత!
ఇందులో భాగంగా మొదటి నుంచి తనకు అండగా ఉన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మరో ఎంపీ మిథున్ రెడ్డికి కేంద్రంలో మంత్రులుగా అవకాశం కల్పించాలని వైసీపీ అధినేత భావిస్తున్నారని టాక్.
ఒకవేళ పార్టీకి చెందిన మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి మరోసారి ఎంపీలుగా పోటీ చేసి ఉంటే… ఈ అంశంలో నిర్ణయం తీసుకోవడం జగన్‌కు కష్టంగా మారి ఉండేది.
తాము అనుకున్న దానికంటే ఎంపీ సీట్లు అధికంగా వచ్చి.. కేంద్రంలో మరిన్ని పదవులు వచ్చే అవకాశం ఉంటే.. ఒక బీసీ, మరో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఎంపీకి కేంద్రంలో మంత్రి పదవులను జగన్ ఇప్పించే ఛాన్స్ ఉందని సమాచారం.
చదవండి: పవన్ కళ్యాణ్ కూడా సీఎం కావొచ్చు! మెగా బ్రదర్ ఆసక్తికర వ్యాఖ్యలు!








