
పనాజీ: బీజేపీ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణించిన కొద్ది గంటలకే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోవా గవర్నర్ మృధుల సిన్హాను కలిసేందుకు ప్రయత్నించడంపై బీజేపీ నేతలతోపాటు పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంతేగాక, #vampireCongress హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు నేడు గవర్నర్ మృదుల సిన్హాను కలిసేందుకు ప్రయత్నించారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మృతి చెందడంతో ఆ సంకీర్ణ ప్రభుత్వ బలం 12కు పడిపోయిందని, తమ పార్టీకి 14 మంది ఎమ్మెల్యేల బలం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతుండటం గమనార్హం.
తమదే పెద్ద పార్టీ అంటూ..
ప్రస్తుతం తమదే పెద్ద పార్టీ కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. సోమవారం ఉదయం పనాజీలో జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రతిపక్షనేత చంద్రకాంత్ కావ్లేకర్ అన్నారు. అయితే ఈ విషయంలో వీరికి గవర్నర్ అపాయింట్‌మెంట్ నిరాకరించినట్లు సమాచారం.
ప్రస్తుతం పెద్ద పార్టీగా అవతరించిన తమకు గవర్నర్ అపాయింట్‌మెంట్ నిరాకరించడంతో 14 మంది ఎమ్మెల్యేలతో కాలినడకన రాజ్‌భవన్‌కు చేరుకోనున్నామని చంద్రకాంత్ కావ్లేకర్ తెలిపారు.
గోవాలో 40 శాసనసభ స్థానాలున్నాయి. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుభాశ్ శిరోద్కర్, దయానంద్ సోప్తి గత సంవత్సరం రాజీనామా చేశారు.
Vultures of Congress..
Within 2 hours post death of Manohar Parrikar this is the letter sent by Congress to governor followed by emergency meeting of all MLA's
This culture of Rahul Gandhi's Congress😡😡😡😡😡😡😡 #VampireCongress pic.twitter.com/bS7u7f1aFH
— Dr A.K. Srivastava🇮🇳 (@Anubhav_kabir) March 18, 2019
ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ ఆదివారం సాయంత్రం మృతి చెందిన విషయం తెలిసిందే. మరో బీజేపీ ఎమ్మెల్యే ఫ్రాన్సిస్ డిసౌజా కూడా మరణించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గోవా శాసనసభలో 36మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. వారిలో 14 మంది కాంగ్రెస్‌కి చెందిన వారు కాగా, ముగ్గురు స్వతంత్రులు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. ఈ ముగ్గురిని కలుపుకొంటే బీజేపీకి ప్రస్తుతం 12 మంది ఎమ్మెల్యేల బలమే ఉండనుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.








