28.2 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ వివేకా సూసైడ్ లెటర్ రాసింది ఎవరో తెలుసా? తేల్చేసిన సిట్ అధికారులు!

వివేకా సూసైడ్ లెటర్ రాసింది ఎవరో తెలుసా? తేల్చేసిన సిట్ అధికారులు!

- Advertisement -

కడప: మాజీ ఎమ్మెల్యే , ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాత్రి 11 గంటల సమయంలో ప్రచారం ముగించుకొని పడుకున్న వివేకా, తెల్లవారేసరికి అతి దారుణంగా హత్య చేయబడ్డాడు.

మొదటగా హార్ట్ ఎటాక్ అని చెప్పినా , పోస్ట్ మార్టం అనంతరం హత్య అని నిర్దారించారు. ఇదే సమయంలో ఆయన రాసినట్టుగా చెబుతున్న ఓ లేఖ పై కూడా హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. చనిపోయేంత తీవ్రగాయాలు అయిన ఆయన నెత్తురోడుతున్న సమయంలో ఆ లేఖ నిజంగా రాశారా అనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది.

అయితే నిజంగా ఆ లేఖ రాసింది వివేకానే అని చెబుతున్నారు పోలీసులు. కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆ లేఖ రాసింది వివేకానంద రెడ్డేనని కన్ఫామ్ చేశారు. తమ దర్యాప్తులో అది నిజమని తేలిందని ఆయన చెప్పారు. ఆ లెటర్ తన కారు డ్రైవర్ తననను త్వరగా రమ్మని చెప్పినందుకు కొట్టి చంపాడు అని ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఆ లెటర్ ని పోలీసులు ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం పంపించారు. కాగా.. అది వివేకానంద రెడ్డి చేతిరాత అని రిపోర్టులో తేలిందని పోలీసులు చెబుతున్నారు

- Advertisement -