33.2 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం అమెరికా బిన్‌లాడెన్‌ను చంపినట్లే మేమూ చేయగలం: జైట్లీ

అమెరికా బిన్‌లాడెన్‌ను చంపినట్లే మేమూ చేయగలం: జైట్లీ

arun-jaitley
- Advertisement -

న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలను సమూలంగా నాశనం చేసే శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌ విమానాలు సరిహద్దు నియంత్రణ రేఖను దాటి భారత్‌లోకి ప్రవేశించడం, రాజౌరీ సెక్టార్‌లోని ఆర్మీ పోస్ట్ వద్ద బాంబులు వదిలాయన్న వార్తల నేపథ్యంలో బుధవారం కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందించారు.

అమెరికా చేసినట్లు సాధ్యమే..

పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో ఆల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌లాడెన్‌ మట్టుపెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఈ రోజుల్లో ఏదైనా సాధ్యమేనని స్పష్టం చేశారు. ‘యూఎస్‌ సైన్యం ఒసామాను చంపగలిగితే, ఈ రోజుల్లో ఏదైనా సాధ్యమే. పాకిస్థాన్‌ కాంపౌండ్‌లో అమెరికా సైన్యం లాడెన్‌ను ఎలా హతమార్చిందో నేను గుర్తు చేసుకుంటున్నా. అలా మేము చేయలేమా? అది ఒకప్పుడు అసాధ్యమైన ప్రక్రియ. కానీ, ఇప్పుడు కూడా అది సాధ్యం’ అని పాక్‌ చర్యలను ఉద్దేశించి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు.

మసూద్ అజార్ నాయకత్వంలోని జేషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పుల్వామాలో జరిపిన ఆత్మాహుతి దాడిలో 40మందికి సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ముంబైలో జరిగిన 26/11దాడికి సూత్రధారి కూడా మసూద్ అజారే. ప్రస్తుతం మసూద్ అజార్ పాకిస్థాన్‌లోనే ఉంటున్నా.. ఆ దేశం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై భారత్ మండిపడుతోంది.

ఈ నేపథ్యంలోనే పుల్వామా దాడికి ప్రతీకారంగా మంగళవారం తెల్లవారుజామున పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపుదాడులు జరిపి 300మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది.

చదవండి: మా అదుపులోనే ఇద్దరు ఐఏఎఫ్ పైలట్లు: పాక్, వీడియో రిలీజ్, ఒక పైలట్ అదృశ్యమంటూ భారత్

- Advertisement -